మేనకోడలితో చరణ్ డాన్స్

Ram Charan's dance with niece
Tuesday, August 4, 2020 - 15:15

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన రామ్ చరణ్, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాల్ని, ఇంట్లో చేస్తున్న పనుల్ని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు పెడుతూనే ఉన్నాడు. తాజాగా అలాంటిదే మరో వీడియో షేర్ చేశాడు చరణ్. తన మేనకోడలితో కలిసి డాన్స్ చేసిన వీడియో ఇది.

తన చెల్లెలు శ్రీజ కూతురు నవిష్కతో చరణ్ డాన్స్ చేశాడు. ఓ చిన్న పిల్లల వీడియో పెట్టి, ఆ పాటకు తను చిన్న చిన్న స్టెప్పులేస్తూనే, మేనకోడలికి కూడా డాన్స్ మూమెంట్స్ నేర్పించాడు. ప్రస్తుత ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో నవిష్కతో చిరంజీవి చేసిన అల్లరి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150లో సాంగ్ పెట్టి చిరు-నవిష్క చేసిన అల్లరి వీడియో మెగాభిమానులకు ఇప్పటికీ గుర్తే. ఇప్పుడు చరణ్-నవిష్క కూడా తాజా వీడియోతో సందడి చేశారు.