సానియాతో రఫ్ఫాడించిన రామ్ చరణ్

Ram Charan's hungama at Sania Mirza's sister's wedding
Sunday, December 15, 2019 - 09:00

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ఇం
డియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

వీళ్లిద్దరు కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అసలు రామ్ చరణ్ సరసన సానియా మీర్జా ఎలా ఉంటుంది. వీళ్ల పెయిర్ బాగుంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సింగిల్ వీడియో సమాధానం చెబుతోంది. చెర్రీ-సానియా కలిసి డాన్స్ చేసిన వీడియోను.. ఉపాసన షేర్ చేసింది.

రీసెంట్ గా సానియా మీర్జా చెల్లెలు పెళ్లి జరిగింది. క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి వేడుకలో సానియాతో కలిసి, వార్ అనే సినిమాలోని పాటకు డాన్స్ చేశాడు చరణ్. వీళ్లిద్దరితో స్టెప్పులేయించే బాధ్యతను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తీసుకున్నారు.

అలా ఫరాఖాన్ స్టెప్పులకు రామ్ చరణ్, సానియా కలిసి డాన్స్ చేశారు. వీడియోలో పార్టీ వేర్ లో రామ్ చరణ్ అదిరిపోయాడు. అటు సానియా కూడా లాంగ్ ఫ్రాక్ లో చాలా గ్లామరస్ గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.