తాత అయిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma is blessed with a granddaughter
Monday, February 10, 2020 - 09:30

తాతగా మారారు రామ్ గోపాల్ వర్మ. 

రామ్ గోపాల్ వర్మ .... పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ప్రతిరోజు అమ్మాయిల గురించి, వాళ్ళ అందాల గురించి మాట్లాడుతుంటారు. 60కి దగ్గరికి వచ్చిన సెక్స్ గురించి కబుర్లు చెప్తుంటారు. తీసే సినిమాల్లో కూడా హీరోయిన్లతో అందాలు ఆరబోయిస్తూ ఉంటారు. కూతురికి పెళ్లి అయిన తర్వాత ఆయన కొంత వెనక్కి తగ్గ్గుతారు అని అనుకున్నారు కానీ నో చేంజ్. 

ఇప్పుడు ఆయన తాత అయ్యారు. వర్మ కూతురు ... ఒక పాపకి జన్మనిచ్చింది. వర్మ కూతురుకి కూతురు పుట్టిన విషయాన్నీ ... రాజమౌళి ఆనందంగా షేర్ చేశారు. "రాము తాతయ్య గారికి కంగ్రాట్స్. మీ మనవరాలు మీ దూకుడుకి కళ్లెం వేస్తుంది అని ఆశిస్తున్నా. అవును ఇంతకీ మీకు ఏది ఇష్టం... రాము తాత అని పిలవడమా లేక రాము నాన్న అనా, రాము గ్రాండ్ పా అనడమా," అని ట్వీట్ చేసి రాజమౌళి రామ్ గోపాల్ వర్మని ఆట పట్టించారు.