టైమ్ చూసి రేటు పెంచిన వర్మ

Ram Gopal Varma hikes rate for his next film Naked
Monday, June 8, 2020 - 18:15

ఈ లాక్ డౌన్ టైమ్ ను వర్మ బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. సీక్రెట్ గా "క్లైమాక్స్" అనే సినిమా షూటింగ్ ను పూర్తిచేసి, సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వర్మ.. తను అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యాడు. "క్లైమాక్స్" సినిమాను సోషల్ మీడియాలో 12 గంటల్లోనే 1,68,596 మంది వీక్షించారని క్లెయిమ్ చేసుకున్న వర్మ.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తన నెక్ట్స్ మూవీని కూడా ఇదే పద్ధతిలో రిలీజ్ చేయాలని నిర్ణయించాడు.

ఈ లాక్ డౌన్ టైమ్ లోనే "నగ్నం (నేకెడ్)" అనే సినిమాను పూర్తిచేసిన వర్మ దాన్ని కూడా "క్లైమాక్స్" టైపులోనే విడుదలకు సిద్ధంచేశాడు. అయితే ఈసారి రేటు పెంచాడు. "క్లైమాక్స్" సినిమాకు వంద రూపాయలు ఛార్జ్ చేసిన వర్మ..  "నగ్నం (నేకెడ్)" సినిమాకు రేటును 200 రూపాయలకు ఫిక్స్ చేశాడు.

ఇలా టైమ్ చూసి రేటు డబుల్ చేశాడు వర్మ. ఇకపై రెగ్యులర్ థియేటర్ తో పాటు ఇలాంటి "వరల్డ్ థియేటర్ ప్రీమియర్" కోసం కూడా సినిమాల్ని సిద్ధం చేస్తానని ప్రకటించిన వర్మ.. డిమాండ్ పెరిగినప్పుడు రేటు పెంచడంలో తప్పు లేదన్న వర్మ.. "నగ్నం" సినిమాతో మరిన్ని సంచలనాలు చూస్తారని అంటున్నాడు.