పెళ్లిపై రియాక్ట్ అయిన రామ్

Ram reacts on reports about wedding
Friday, May 15, 2020 - 16:30

టాలీవుడ్ లో ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. రానా పెళ్లికి రెడీ అయ్యాడు. నితిన్ రేపోమాపో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వరుణ్ తేజ్ కూడా త్వరలోనే అంటున్నాడు. ఈ నేపథ్యంలో హీరో రామ్ కూడా తన పెళ్లిపై స్పందించాడు. కాకపోతే ఎప్పుడు చేసుకుంటాననే విషయాన్ని మాత్రం ఈ ఎనర్జిటిక్ స్టార్ బయటపెట్టలేదు.

"ప్రస్తుతానికి ఇలా సింగిల్ గా ఉంటేనే బాగుందనిపిస్తోంది. అయినా ప్రేమ-పెళ్లి లాంటివి మన చేతుల్లో ఉండవు కదా. కాబట్టి అవన్నీ జరగాల్సిన సమయం వస్తే జరిగిపోతాయి." ఇలా పెళ్లిపై నర్మగర్బంగా కామెంట్ చేశాడు రామ్. అతడి కామెంట్ చూస్తుంటే ప్రేమలో ఉన్నాడని కొందరు.. లేదు పెద్దలకే ఆ పని వదిలేశాడని మరికొందరు చర్చించుకోవడం స్టార్ట్ చేశారు.

ఈ వాదన సంగతి పక్కనపెడితే.. రామ్ కూడా పెళ్ళీడుకొచ్చాడు.. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ హీరోకు 32 ఏళ్లొచ్చాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.