అంగరంగ వైభవంగా రామోజీ మనవరాలి పెళ్లి

Ramoji rao grand daughter wedding
Sunday, July 16, 2017 - 11:15

మీడియా టైకూన్ రామోజీరావు మనవరాలు, ఈనాడు గ్రూప్ సంస్థల ఎండీ కిరణ్ కుమార్తె చెరుకూరి సహారి పెళ్లి ఈనెల 28న గ్రాండ్ గా జరగనుంది. ఎల్ల వీరేంద్ర దేవ్ తో సహారి వివాహం రామోజీ ఫిలింసిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందాయి.

 

చాలా ఏళ్ల తర్వాత రామెజీ ఇంట జరుగుతున్న శుభకార్యం కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో కనివినీ ఎరుగని రీతిలో సెట్ ఏర్పాటుచేస్తున్నారు. కేవలం రిసెప్షన్ కోసమే ఈ సెట్ అట. ఈనెల 28న సాయంత్రం 7 గంటల నుంచి రిసెప్షన్ ఉంటుంది. అదే రోజు రాత్రి 12 గంటల 6 నిమిషాలకు (మరుసటి రోజు శనివారం) పెళ్లి ఉంటుంది. ఇక పెళ్లికి మరో భారీ సెట్ వేశారట. 

 

పెళ్లికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులకు ఒక్కొక్కరిగా ఆహ్వానాలు అందుతున్నాయి. అతి ముఖ్యమైన ప్రముఖుల్ని రామోజీ రావు తనయుడు కిరణ్ స్వయంగా ఆహ్వానిస్తున్నారు.