రమ్య, నయన ఆస్తులు గోవిందా!

Ramya Krishna and Nayanathara lands land in trouble
Sunday, July 26, 2020 - 16:00

సినీతారలు తాము సంపాదించిన డబ్బులో చాలా భాగాన్ని భూములు, బిల్డింగుల మీద పెడుతుంటారు. ఇది చాలా సాధారణ విషయం. నయనతార, రమ్యకృష్ణ కూడా ఇదే పని చేశారు. కానీ ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వీళ్లిద్దరూ దారుణంగా మోసపోయారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలో నయనతార, రమ్యకృష్ణ చెరో ఎకరం భూమి చొప్పున కొనుగోలు చేశారు. హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆదిత్య హోమ్స్ నుంచి వీళ్లు ఈ భూమిని కొనుగోలు చేశారు. అయితే అవి చెరువు శిఖం భూములని, వాటి రిజిస్ట్రేషన్ చెల్లదని తెలుస్తోంది.

ఆదిత్య హోమ్స్ పార్టనర్స్ మధ్య ఈమధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ డైరక్టర్ సుధీర్ రెడ్డి, ఇలాంటి ఎన్నో అవకతవకల్ని బయటపెట్టారు. ఇందులో భాగంగా నయనతార, రమ్యకృష్ణలను కూడా ఆదిత్య హోమ్స్ మోసం చేసిందన్నారు సుధీర్ రెడ్డి.

Nayan

అంతేకాదు.. వీళ్లు కొనుగోలు చేసిన సైట్ కు పక్కనే సచిన్ టెండూల్కర్ కు ఏకంగా 6 ఎకరాల ల్యాండ్ ఉంది. అది కూడా చెరువు శిఖం భూములే అనే విషయం ఇప్పుడు బయటపడింది. దీనిపై రమ్యకృష్ణ, నయనతార ఎలా స్పందిస్తారో చూడాలి. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.