రమ్యకృష్ణ డ్రైవర్ అరెస్ట్

Ramya Krishna driver caught smuggling liquor boxes
Saturday, June 13, 2020 - 18:15

రమ్యకృష్ణ డ్రైవర్ తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డాడు. రమ్యకృష్ణ కారులో లిక్కర్ బాటిల్స్ తో దొరికాడు. సెలబ్రిటీల కారులో లిక్కర్ బాటిల్ ఉంటే తప్పేంటని అనుకోవచ్చు. కానీ ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 96 బీర్ బాటిళ్లు దొరికాయి. 8 లిక్కక్ సీసాలు దొరికాయి. అది కూడా లిక్కర్ పై ఆంక్షలు కొనసాగుతున్న వేళ.

అవును.. చెన్నై, పాండిచ్చేరి బార్డర్ లో రమ్యకృష్ణ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాండీ నుంచి చెన్నైకు అక్రమంగా ఈ మద్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. డ్రైవర్ సెల్వకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కారు రమ్యకృష్ణదేనని పోలీసులు నిర్థారించారు.

తమిళనాడులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో వైన్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ఇలాంటి టైమ్ లో ఇంత లిక్కర్ తో ఆతను దొరికాడు. అయితే, ఈ డ్రైవర్ నిర్వాకం రమ్యకృష్ణకి తెలిసి ఉండదు. ఎందుకంటే ఆమె షూటింగ్ లు లేకుండా ఇంట్లోనే ఉంటోంది. అరెస్టైన సెల్వకుమార్, వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజయ్యాడు. 

రమ్యకృష్ణ ఇంకా ఈ వ్యవహారంపై స్పందించలేదు.