బిగ్ బాస్ 3: అదరగొట్టిన రమ్యకృష్ణ

Ramya Krishna gets lot of appreciation for Bigg Boss 3
Sunday, September 1, 2019 - 23:45

నాగార్జున తన 60వ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు స్పెయిన్ వెళ్లడంతో, ఆయన స్థానంలో 'బిగ్ బాస్'లోకి వచ్చింది రమ్యకృష్ణ. శనివారం, ఆదివారం... రెండు రోజులు రమ్యకృష్ణ హోస్టుగా అదరగొట్టింది. టెంపరరీ హోస్ట్ గానే వచ్చింది కానీ ఆమె టాలెంట్ చూసినవారంతా రమ్యకృష్ణ కనీసం వచ్చే సీజన్లో అయినా నాగార్జున ప్లేస్ లో మెయిన్ హోస్టుగా రావాలని అంటున్నారు. దీన్ని బట్టే ..ఆమె ఏ రేంజ్లో జనాలని తన హోస్టింగ్ స్కిల్స్ తో మెప్పించిందో అర్థం అవుతోంది. 

నటిగా రమ్యకృష్ణ టాలెంట్ అందరికి తెలుసు. కానీ బుల్లితెర పై ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలంటే చాలా కష్టం. రమ్యకృష్ణ మాత్రం ...తన మాటే శాసనం అన్నట్లుగా అదరగొట్టింది.