రానా,మిహీక ఫ్యామిలీ టైం

Rana and Miheeka families meet
Wednesday, May 20, 2020 - 14:00

రానా దగ్గుబాటి, తన ప్రియురాలు మిహీక బజాజ్ ని ఇప్పటికే తన తల్లితండ్రులకి పరిచయం చేశాడు. ఇప్పుడు రెండు కుటుంబాలు పరిచయాలు పెంచుకుంటున్నాయి. అటు దగ్గుబాటి కుటుంబం, ఇటు బజాజ్ కుటుంబం మల్టీ మిల్లియనార్ల ఫామిలీస్. సో, అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, కలిసిపోవడం కోసం ఒక స్పెషల్ ఈవెంట్ పెట్టుకున్నారు. అది ఈ రోజు జరుగుతోంది.

35 ఏళ్ల రానా 28 ఏళ్ల మిహీక పెళ్లి త్వరలోనే జరగనుంది. మరో నెలలో మంచి ముహుర్తాలు అయిపోతున్నాయి. దాంతో ఈ లోపే ఎంగేజ్మెంట్ పూర్తిచేస్తారట. ఈ రోజే నిశితార్థం అని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత రానా టీం క్లారిటీ ఇచ్చింది. ఇది ఇరు కుటుంబాల గెట్ టుగెథర్ అని తెలిపింది.

రానా ప్రస్తుతం 'విరాట పర్వం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ వల్ల ఆగింది. ఈ గ్యాప్ ని ఇలా తన పెళ్ళి పనులకు యూజ్ చేసుకుంటున్నాడు.