రానా దూకుడు అందుకేనా?

Rana turns singer, proves his energy
Monday, November 11, 2019 - 16:45

రానా అనారోగ్యం గురించి, ట్రీట్ మెంట్ గురించి మీడియా చాలా కథనాలు ఇచ్చింది. నాలుగు నెలలు పాటు అమెరికాలో ట్రీట్ మెంట్ చేయించుకొని ఇండియా వచ్చాడు రానా. అయితే, రానా ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదని, షూటింగ్ పేరుతో ఎక్కువ కష్టపడకూడదని డాక్టర్లు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. దాంతో రానాతో సినిమాలు చేద్దామనుకుంటున్న మేకర్స్ లో ఒక డైలమా మొదలైంది. రానా ఫిజికల్ గా ఎక్కువ స్ట్రైన్ అయ్యే కథలు రాయకూడదేమో అని భావనలో ఉన్నారు. 

ఈ ప్రచారానికి చెక్ పెట్టాలంటే.. ఒకటే పద్ధతి. తన ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో జనాలందరికి తెలియచేయడమే. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు రానా. అన్ని ప్రెస్ మీట్స్ అటెండ్ అవుతున్నాడు, ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. సినిమా నటన ఇంకా మొదలు పెట్టలేదు కానీ ఇప్పుడు పాటలు కూడా పాడాడు. హీరోగా మెప్పించాడు. విలన్ గా చేశాడు. నిర్మాతగా కూడా మారాడు. టీవీ షోలు కూడా చేశాడు. ఇలా ఎన్నో రంగాల్లో రాణించిన రానా, ఇప్పుడు కొత్తగా ఇంకోటి ట్రై చేశాడు. అవును.. రానా పాట పాడాడు.

విశాల్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా ప్రచారం కోసం పాట పాడాడు రానా.  పైగా ఇది రెగ్యులర్ ట్యూన్ కాదు. ర్యాప్ స్టయిల్ లో సాగే సాంగ్. పాట పాడడమే గొప్ప విషయం అనుకుంటే, ర్యాప్ స్టయిల్ లో పాడి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు ఈ దగ్గుబాటి హీరో. తన సినిమా కోసం రానా పాట పాడాడనే విషయాన్ని హీరో విశాల్ స్వయంగా ప్రకటించాడు. ఆ వెంటనే రికార్డింగ్ స్టుడియోలో రానా ఉన్న పిక్స్ రిలీజ్ అయ్యాయి. యాక్షన్ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ కు ఎడిట్ సూట్ లో ఫైనల్ మిక్సింగ్ లు జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది. గాయకుడిగా రానా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. 

ఇలా మొత్తమ్మీద , రానా తాను ఫుల్ ఎనర్జీ తో ఉన్నట్లు అందరికి తెలియచేస్తున్నాడు.