అది రానా పెళ్లి కార్డు కాదు

Rana's father gives clarity on viral wedding card
Friday, July 24, 2020 - 15:30

వచ్చేనెల 8న పెళ్లి చేసుకోబోతున్నాడు రానా. ఇంతవరకు కరెక్ట్. కానీ ఆ పెళ్లి 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందట.. మణికొండలోని చైతన్య ఎన్ క్లేవ్ లో పెళ్లి జరుగుతుందట.. కేసీఆర్, జగన్ ప్రత్యేక అతిథులంట. ఇలా ఓ వీడియో వెడ్డింగ్ కార్డు తయారైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీనిపై రానా తండ్రి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఆ వెడ్డింగ్ కార్డుకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు సురేష్ బాబు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఇంకా ఆహ్వానించలేదని కూడా తెలిపారు.

మాయాబజార్ లో మాయాపేటిక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని ఈ వెడ్డింగ్ కార్డు రూపొందించారు. మాయాబజార్ లో పాత్రలన్నీ ఒక్కొక్కటిగా వచ్చి, మేజిక్ బాక్స్ తెరుస్తుంటే.. రానా-మిహీకాల పెళ్లికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చేలా ఆ వీడియోలో ఉంది. దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.