ర్యాప్ స్టయిల్ లో రానా

Rana's Rap song
Friday, November 15, 2019 - 08:30

రానాను ఇప్పటికే ఎన్నో షేడ్స్ లో చూశాం. హీరోగానే కాకుండా విలన్ గా, నిర్మాతగా, హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో రోల్స్ పోషించాడు. అసలు హీరోగా కాకముందు రానాకు ఓ గ్రాఫిక్స్ స్టుడియో కూడా ఉండేది. వీటికి తోడు టెలివిజన్ షోలు, స్టేజ్ షోలు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నో యాంగిల్స్ ను చూపించిన రానా, ఇప్పుడు తనలో మరో కోణాన్ని బయటపెట్టాడు. విశాల్ కోసం యాక్షన్ సినిమా ప్రమోషనల్ సాంగ్ ను పాడాడు.

ర్యాప్ స్టయిల్ లో రానా పాడిన ఈ పాట నిజంగా బాగుంది. ఎంత బాగుందంటే ఒక దశలో రానానే ఈ పాట పాడాడా అనిపిస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ హిపాప్ తమిళ, మరో సింగర్ రోల్ రిడాతో కలిసి రానా పాడిన ఈ పాట ఇనిస్టెంట్ గా హిట్ అయిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే కనీసం 2 రోజుల ముందైనా ఈ పాట విడుదల చేస్తే బాగుండేది. సరిగ్గా సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు మాత్రమే ఈ పాట రిలీజైంది.

కేవలం సినిమా ప్రచారం కోసమే ఈ సాంగ్ ను ఉపయోగిస్తున్నారు. ఇదే పాటను అటు తమిళ్ లో ఆది పినిశెట్టి పాడాడు. తెలుగులో రానాకు దానికి ఎక్స్ ట్రా మసాలా యాడ్ చేశాడు. రానా పాట పాడడం ఒకెత్తయితే, ఆ పాటతో పాటు విడుదల చేసిన మేకింగ్ వీడియో మరో ఎత్తు. సాంగ్ పరంగానే కాకుండా.. విజువల్ గా కూడా ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.