'రంగ్ దే'కి బంపర్ ఆఫర్

Rang De locks great satellite deal
Thursday, April 2, 2020 - 07:30

ఇప్పటికే నితిన్ కెరీర్ సూపర్ హిట్ మూవీ "అ..ఆ" జీ తెలుగు వద్ద ఉంది. దీంతో పాటు అతడు నటించిన లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు కూడా ఆ ఛానెల్ వద్దే ఉన్నాయి. ఇప్పుడు ఈ లైబ్రరీకి మరో మూవీ యాడ్ అయింది. నితిన్ అప్ కమింగ్ మూవీ "రంగ్ దే".. జీ తెలుగు వశమైంది.

తాజా సమాచారం ప్రకారం.. "రంగ్ దే" శాటిలైట్ రైట్స్ ను 10 కోట్ల రూపాయలకు దక్కించుకుంది జీ గ్రూప్. డిజిటల్ రైట్స్ కు ఇది అదనం. నితిన్ నటించిన "భీష్మ" సినిమా సూపర్ హిట్టవ్వడంతో.. ఆ వెంటనే రాబోతున్న "రంగ్ దే" సినిమాకు ఇలా చకచకా బిజినెస్ పూర్తవుతుంది.

వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్, పీసీ శ్రీరామ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తోంది "రంగ్ దే".