శుభమా అని పెళ్లి చేసుకుంటూ

Rang De teaser with Batuku Bustand song
Sunday, July 26, 2020 - 16:30

శుభమా అని పెళ్లి చేసుకుంటూ "పెళ్లి చేసుకుంటే బతుకే ఇక బస్టాండ్" అంటూ టీజర్ రిలీజ్ చెయ్యడమేంటో. ఈ రోజు నితిన్ పెళ్లి. ప్రేమించిన అమ్మాయితోనే వివాహం. నితిన్ పెళ్లికి కానుకగా అంటూ "రంగ్ దే" సినిమా మేకర్స్ ఒక టీజర్ రిలీజ్ చేశారు ఈ రోజు. 

నితిన్, కీర్తి సురేష్ హీరో,హీరోయిన్లుగా రూపొందిన ఈ టీజర్లో కూడా పెళ్లి ప్రస్తావన ఉంది. పెళ్లి చేసుకుంటే బ్రతుకు బస్టాండ్ అంటూ సినిమాలో ఉన్న సాంగ్ తో టీజర్ ని కట్ చేశారు. ఆనందంగా పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో ఇలాంటి పాటతో టీజర్ విడుదల చెయ్యడం ఏంటో. 

నితిన్, షాలిని ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ సమ్మర్లో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్లాన్ చేశారు. కానీ కరోనా వాళ్ళ డేట్ మారింది. ఈ రోజు ఓ ఇంటి వారవుతున్నారు.