చితక్కొట్టిన చిట్టిబాబు

Rangasthalam and Mahanati score high at Filmfare Awards
Monday, December 23, 2019 - 08:30

అంతా ఊహించినదే. అవార్డుల్లో రంగస్థలం ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకున్న ఈ సినిమా, తాజాగా ప్రకటించిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో కూడా తన సత్తా చాటింది. రాత్రి చెన్నైలో ఫిలింఫేర్ సౌత్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నుంచి దాదాపు వందకు పైగా సినిమాలు పోటీపడ్డాయి.

వీటిలో పూర్తి డామినేషన్ మన చిట్టిబాబుదే కనిపించింది. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర పోషించిన రామ్ చరణ్, ఈ ఏటి  ఉత్తమ నటుడిగా అవతరించాడు. బెస్ట్ హీరో అవార్డ్ కొల్లగొట్టాడు. ఈ సందర్భంగా రంగస్థలం నుంచి రామ్ చరణ్ నటించిన క్లిప్స్ కొన్ని మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. జయహో చిట్టిబాబు అంటూ మెగా ఫ్యాన్స్ మరోసారి హంగామా చేశారు.

బెస్ట్ హీరోతో పాటు మరో నాలుగు విభాగాల్లో ఈ సినిమా అవార్డులు ఎగరేసుకుపోయింది. ఉత్తమ సహాయనటిగా అనసూయ నిలిచింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ అవార్డులు అందుకున్నారు. అయితే ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ మాత్రం అవార్డు అందుకోలేకపోయాడు. ఈ విభాగంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ అవార్డ్  ఎగరేసుకుపోయాడు. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.