ఇస్మార్ట్ గా మారబోతున్న రణ్వీర్

Ranveer Sing to iSmart Shankar?
Thursday, October 3, 2019 - 21:30

మరో తెలుగు సినిమాపై కన్నేశాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఇప్పటికే టెంపర్ సినిమాను హిందీలో రీమేక్ చేసిన హీరో, ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. రీసెంట్ గా రణ్వీర్ కు ఈ సినిమా గురించి అతడి సన్నిహితులు సమాచారం అందించారు. ఆ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని సూచించారు. దీంతో ఈ సినిమా గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశాడు రణ్వీర్.

ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కు పక్కా మాస్ ఇమేజ్ కట్టబెట్టింది. ఈ సినిమాలో కంప్లీట్ మాస్ లుక్స్ లో కనిపించాడు రామ్. ఇలాంటి మాస్ మూవీ రణ్వీర్ సింగ్ చేస్తే బాగుంటుందని సినిమా రిలీజ్ అయినప్పుడే చాలామంది అభిప్రాయపడ్డారు. పైగా అర్బన్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా. అందుకే  రణ్వీర్ సింగ్ కూడా ఆలోచనలో పడ్డాడు

ఇస్మార్ట్ శంకర్ రీమేక్ రైట్స్ తాజాగా అమ్ముడుపోయాయి. ఎవరు దక్కించుకున్నారనే విషయాన్ని మాత్రం నిర్మాత చార్మి బయటపెట్టడం లేదు. సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జీ గ్రూప్ మాత్రం రీమేక్ రైట్స్ తీసుకోలేదు. కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు మాత్రమే పరిమితమైంది. త్వరలోనే ఈ సినిమా హిందీ రీమేక్ పై ఓ క్లారిటీ రానుంది.