సమంత కొడుకుగా రావు రమేష్?

Rao Ramesh as Samantha's son?
Thursday, December 27, 2018 - 18:15

మీరు చదివింది నిజమే. సమంత కొడుకుగా రావు రమేష్ నటిస్తున్నాడు. గతంలో రావురమేష్ కూతురుగా సమంత నటిస్తే, ఇప్పుడు సమంత కొడుకు పాత్రలో రావురమేష్ కనిపించబోతున్నాడు. కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ ఇదే నిజం.

సమంత అప్ కమింగ్ మూవీలో రావు రమేష్ ఇలా ఆమెకు కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు. నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది సమంత. కొరియన్ మూవీ "మిస్ గ్రానీ"కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో "ఓ బేబీ - ఎంత సక్కగున్నావే" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలోనే సమంత, రావు రమేష్ తల్లికొడుకులుగా కనిపించబోతున్నారు. సినిమాలో 70 ఏళ్ల ముసలావిడ పాత్రలో సమంత కనిపించబోతోంది. ఆమె కొడుకుగా రావు రమేష్ కనిపిస్తాడు.

ఒకరోజు హఠాత్తుగా పడుచు పిల్లగా మారిపోతుంది సమంత. అప్పుడు సమంత-రావు రమేష్ వచ్చే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయట. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది.