సుడిగాలి సుధీర్ పై రష్మీ రియాక్షన్

Rashmi Gautam responds on Sudigaali Sudheer
Thursday, November 28, 2019 - 13:15

సుడిగాలి సుధీర్ కాస్తా సాఫ్ట్ వేర్ సుధీర్ గా మారాడు. ఈ సినిమాతో అతడు హీరో అయ్యాడు. అయితే తన తొలి సినిమాకు క్లోజ్ ఫ్రెండ్ రష్మిని హీరోయిన్ గా పెట్టుకోకుండా, ధన్య బాలకృష్ణను హీరోయిన్ గా తీసుకున్నాడు. అలా రష్మీని మిస్ అయిన సుడిగాలి సుధీర్, ప్రచారంలో మాత్రం ఆమెను కవర్ చేశాడు.

రీసెంట్ గా సాఫ్ట్ వేర్ సుధీర్ ట్రయిలర్ లాంఛ్ అయింది. ఢీ అనే కార్యక్రమంలో ఈ ట్రయిలర్ ను లాంఛ్ చేశారు. ఆ కార్యక్రమంలో రష్మీ కూడా ఉంది. అలా రష్మీని తన ప్రచారంలో వాడేశాడు సుడిగాలి సుధీర్. ట్రయిలర్ లాంఛ్ సందర్భంగా సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడిన రష్మి.. తన ఫ్రెండ్ ఇప్పుడు హీరో అయ్యాడంటూ రియాక్ట్ అయింది.

"టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హాట్ గా ఉంది. సుధీర్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడు. డైలాగ్స్ ట్రెండీ గా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా సుధీర్ పెద్ద స్టార్‌ అవ్వాలని కోరుకుంటున్నా." రష్మీ ఇలా మాట్లాడుతుంటే సుడిగాలి సుధీర్ సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది కూడా పాల్గొన్నాడు.