ప్రదీప్ తో టచ్ లో ఉన్నా

Rashmi Gautam talks about her friendship with Pradeep
Saturday, May 16, 2020 - 00:15

రష్మీ గౌతమ్ ఉన్నదున్నట్లు మాట్లాడుతుంది. మొహమాటం ఉండదు. కుండబద్దలు కొడుతోంది. నర్మగర్భంగా మాట్లాడే ప్రసక్తే లేదు. మంచైనా చెడైనా స్ట్రెయిట్ ఎటాక్. సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ లేదని డైరెక్ట్ గా చెప్పింది. మరి ఏ యాంకర్ తో క్లోజ్ గా ఉంటావు అంటే... తడుముకోకుండా ప్రదీప్ వైపు వేలు చూపుతోంది. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్ తనకి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తోంది. 

ఈ లక్డౌన్ పీరియడ్ లో తనతోనే రోజూ మాట్లాడుతోందట. అతనితో మాట్లాడకపోతే డిప్రెస్ అయిపోతాను అని చెప్తోంది. ఈ మాటలు విని వారి మధ్య ఎదో ఉంది అనుకోవద్దు. ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్.

30కి చేరువలో ఉన్న రష్మీ గౌతమ్ పెళ్లి గురించి చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె పర్సనల్ లైఫ్ ఎప్పుడూ హెడ్ లైన్స్ లోకి వస్తోంది.