రష్మీ సంపాదనంతా ఏం చేస్తోంది?

Rashmi Gautam's real investment plans
Tuesday, February 25, 2020 - 10:45

స్టార్స్, సెలబ్రిటీలంతా తాము సంపాదించింది ఏం చేస్తారు? బన్నీ, మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు ఏం చేస్తారో మనందరికీ తెలుసు. అనుష్క, పూజా హెగ్డే, సమంత లాంటి హీరోయిన్లు కూడా తమ సంపాదనను ఏం చేస్తారో చాలామందికి తెలుసు. మరి యాంకర్లు ఏం చేస్తారు? మరీ ముఖ్యంగా స్టార్ యాంకర్ రష్మీ తన సంపాదన ఏం చేస్తోంది?

ఒక్కొక్కరికి ఒక్కోటి ఇంట్రెస్ట్. అలానే రష్మీకి కూడా వ్యవసాయం అంటే చాలా ఆసక్తి. అందుకే తన సంపాదన మొత్తం పొలాలు కొనడానికి ఖర్చు చేస్తోందట. రీసెంట్ గా ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో కొన్ని వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసిందట రష్మి. అక్కడే ఓ భారీ ఫామ్ హౌజ్ లాంటిది ఏర్పాటుచేసుకొని, సేంద్రియ వ్యవసాయం చేయాలనేది రష్మీకి కోరికట.

హీరోయిన్లలానే యాంకర్ల కెరీర్ స్పాన్ కూడా చాలా తక్కువ. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ప్రస్తుతం రష్మీ చేస్తోంది ఇదే. ఇప్పటికే విశాఖలో పలు ప్రాపర్టీస్ కొన్న ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు వ్యవసాయ భూములపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిందట. ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ భూముల్లో తనే స్వయంగా వ్యవసాయం చేయాలని అనుకుంటోందట. కోరిక క్రేజీగానే ఉంది కానీ కట్టుకోబోయేవాడు కూడా దీనికి ఒప్పుకోవాలి కదా.