జీఎస్టీ 2 చేస్తా కాదు జీటి2 చేస్తా!

Rashmi Gautham agrees to do GT 2 if Praveen Sattaru directs it
Wednesday, February 7, 2018 - 16:15

రాంగోపాల్ వ‌ర్మ "గాడ్ సెక్స్ ట్రూత్" (జీఎస్టీ)కి సీక్వెల్ తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అడ‌ల్ట్ హీరోయిన్ మియా మాల్కోవాని ఈ వీడియో ఫిల్మ్‌లో పూర్తి న‌గ్నంగా చూపించాడు వ‌ర్మ‌. ఒంటిపై నూలి పోగు లేకుండా ఉన్న మియాని అన్ని యాంగిల్స్‌లో క‌వ‌ర్ చేశాడు. ఈ ఫిల్మ్ స‌క్సెస్ అయింద‌ని వ‌ర్మ ప్ర‌క‌టించాడు. అంతేకాదు సీక్వెల్ కూడా తీస్తాన‌ని చెప్పాడు.

ఈ సీక్వెల్‌లో నటించేంద‌కు తాను రెడీ అని ఇప్ప‌టికే ష‌కీలా ప్ర‌క‌టించింది. ఆమె ప్ర‌క‌టించ‌గానే వ‌ర్మ‌లో గుబులు మొద‌లైన‌ట్లుంది. గ‌ప్‌చుప్‌గా మారిపోయాడు.

తాజాగా హీరోయిన్ ర‌ష్మీ గౌత‌మ్‌ని ఒక కొంటె కుర్రాడు సోష‌ల్ మీడియాలో ఇదే ప్ర‌శ్న అడిగాడు. వ‌ర్మ "జీఎస్టీ"లో చాన్స్ వ‌స్తే న‌టిస్తారా అని ఆ కుర్రాడు అడ‌గిన క్వ‌శ్చ‌న్‌కి ర‌ష్మీ వెంట‌నే స‌మాధానం ఇచ్చింది. జీఎస్టీ కాదు జీటి2లో చేస్తా అని చెప్పింది. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ తీస్తానంటే జీటి2లో తీస్తానంటోంది. ఇంత‌కీ జీటీ 2 అనుకుంటున్నారా? పూర్తి పేరు "గుంటూరు టాకీస్ 2"

"గుంటూర్‌ టాకీస్" సినిమాలో ర‌ష్మీని చాలా అందంగా చూపించాడు ప్ర‌వీణ్ సత్తారు. అది అడ‌ల్ట్ కామెడీ సినిమా. ఆ మూవీ బాగా ఆడింది. "గుంటూరు టాకీస్" సినిమా త‌ర్వాతే ర‌ష్మీ గౌత‌మ్‌కి కుర్ర‌కారులో పాపులారిటీ పెరిగింది. అందుకే కాబోలు..ప్ర‌వీణ్ సత్తారు సీక్వెల్ తీస్తే త‌న‌కి అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించింది.

తెలివిగా జీఎస్టీ 2 కాదు జిటీ 2 చేస్తా అని చెప్పింది.