మరోసారి కస్సుమన్న రష్మి

Rashmi gets angry over a remark
Tuesday, April 14, 2020 - 22:00

కోపమొస్తే ఎదుటి వ్యక్తిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించడానికి ఎప్పుడూ ముందుంటుంది రష్మి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకు ఇష్టంలేని ప్రశ్నలు వేస్తే ఆటోమేటిగ్గా తన కోపాన్ని బయటపెట్టేస్తుంది. తాజాగా జరిగిన ట్విట్టర్ ఛాట్ లో కూడా కొంతమంది ఈ జబర్దస్త్ బ్యూటీ ఆగ్రహానికి గురయ్యారు.

మీకు, సుడిగాలి సుధీర్ కు మధ్య ఎఫైర్ ఉందంటున్నారు కదా.. నిజంగానే ఎఫైర్ ఉందా లేక టీవీ రేటింగ్స్ కోసం టైమ్ పాస్ చేస్తున్నారా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దానిపై మీ కామెంట్ ఏంటనే ప్రశ్నలు ఈ ఛాటింగ్ లో ఎక్కువగా కనిపించాయి. వీటిపై ఘాటుగా స్పందించింది రష్మి. గాసిప్స్ గురించి మాట్లాడ్డం మీకు టైమ్ పాస్, కానీ నాకు కాదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.

అయినప్పటికీ ఈ తరహా ప్రశ్నలు ఆగలేదు. దీంతో వ్యక్తిగతంగా ఎలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ గట్టిగా చెప్పుకొచ్చింది రష్మి. జాబ్ కు సంబంధించి ఏమైనా అడగమని రిక్వెస్ట్ చేసింది. సుధీర్ తో డాన్స్ రిహార్సల్స్ చేయనని, అప్పటికప్పుడు ఇద్దరం కలిసి ఆటోమేటిగ్గా అలా డాన్స్ చేసేస్తామని చెబుతోంది రష్మి.

తనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని, అలాంటి కామెంట్స్ తనను బాధించవని అంటున్న రష్మి.. ఎప్పటికప్పుడు అలాంటి కామెంట్స్ పై సోషల్ మీడియాలో కోపం ప్రదర్శిస్తూనే ఉంది.