ప్రచారమా లేక వివాదమా రష్మీ?

Rashmi making noise on social media during lockown
Thursday, April 2, 2020 - 13:45

జబర్దస్త్ యాంకర్ గా రష్మీకి మంచి పాపులారిటీ ఉంది. కొన్ని సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్ నిండా అందాలు ఆరబోసిన అనుభవం కూడా ఈమెకు ఉంది. ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఆమె వెంపర్లాడుతోందంటోంది ఓ వర్గం. ఇంతకీ మేటర్ ఏంటంటే..

రష్మిని ఒక రిపోర్టర్ తెగ ట్రోల్ చేస్తున్నాడు. రష్మిపై మంత్రి కేటీఆర్ కి కూడా కంప్లయింట్ చేశాడు. ఇంట్లో కూర్చోకుండా బైటకొచ్చి కుక్కలకి ఆహారం ఇచ్చే నెపంతో అందర్నీ ఒకచోట పోగు చేస్తోందని, లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ట్విట్టర్ లో వీరిద్దరి మధ్య మెసేజ్ వార్ నడుస్తోంది.

ఇది మేటర్.. ఈ మొత్తం వ్యవహారంలో నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. సదరు రిపోర్టర్ కావాలనే రష్మిని టార్గెట్ చేశాడని, చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడని, ఆమె అభిమానులు వాదిస్తున్నారు. మరో వర్గం మాత్రం ఈ లాక్ డౌన్ టైమ్ లో రష్మికి కాస్త పాపులారిటీ తెచ్చి పెట్టేందుకు.. సదరు రిపోర్టర్ కావాలనే ఇలా నెగెటివ్ ప్రచారం చేపట్టాడని.. జనాల్ని రష్మి వైపు ఆకర్షించేందుకు అతడిలా రివర్స్ ఎటాక్ మొదలుపెట్టాడని అంటున్నారు.

ఏదేమైనా రష్మి మాత్రం లాక్ డౌన్ టైమ్ ను బాగా వాడుకుంటోంది పెంపుడు జంతువులకు ఆహారం అందిస్తూ.. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతూ బాగానే బిజీ అవుతోంది. జబర్దస్త్ కూడా లేకపోవడంతో ఆమెకిప్పుడు ఇదే ఫుల్ టైమ్ జామ్ అయింది.