రష్మీ మహా అందెగత్తె: సుధీర్

Rashmi is the real beauty: Sudigaali Sudheer
Thursday, July 16, 2020 - 23:15

రష్మీ గౌతమ్ ని మించిన అందెగత్తె ఈ ప్రపంచంలో లేదంట. ఈ మాట అంటోంది ఎవరో కాదు సుడిగాలి సుధీర్. అంత తన్మయత్వంతో చెప్తున్న సుధీర్ .... అందం విషయంలో 10/10కి రేటింగ్ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఆమెలాంటి బ్యూటీని సుధీర్ ఇంకా చూడలేదట.

ఇక సుధీర్ ని మించిన రొమాంటిక్ పర్సన్ ఇంకెవరూ ఉండరు అంటోంది రష్మీ. సినిమాల్లో చూపిస్తారు కదా... ఆ రేంజ్ రొమాంటిక్ అని చెప్తోంది. 

ఇద్దరూ ఇలా ఒకరి గురించి ఒకరు ఈ లెవల్లో కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నా.. తమ మధ్య ఏ మేటర్ నడవట్లేదని చెప్తున్నారు. "మా మధ్య ఏముందో మాకే తెలుసు," అంటున్నాడు సుధీర్. మరి మీడియా మీ గురించి ఎదో ఎదో రాస్తుంది కదా.. అంటే లెట్ దెమ్ రైట్ అన్నట్లు గా సమాధానం ఇచ్చాడు. ఏంటో వీళ్ళ బంధం! మనకు అర్థం కాదులెండి. 

అన్నట్లు .... ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తారట ...తమ ఇమేజ్ కి తగ్గ స్టోరీ కావాలి అని చెప్తున్నారు.