డిసెంబర్‌లో డేట్స్ ఇచ్చిన రష్మిక
నితిన్ కొత్త సినిమా ఎందుకు స్టార్ట్ అవట్లేదు? ఈ ప్రశ్నకి సమాధానం.. హీరోయిన్ రష్మిక డేట్స్ లేకపోవడమే. నితిన్ రీసెంట్‌గా "ఛలో" దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన కథని ఓకే చేశాడు. ఐతే ఈ సినిమలో హీరోయిన్‌గా "గీత గోవిందం" ఫేమ్ రష్మికని తీసుకున్నారు. కథ ప్రకారం.. హీరో, హీరోయిన్‌లపైనే ముందు సీన్లు తీయాలిట. అందుకే నితిన్ కూడా రష్మిక కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.
సితార ఎంటర్‌టెయిన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందే ఈ మూవీ డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నితిన్‌కి ఈ సినిమా చాలా కీలకం. త్రివిక్రమ్ తీసిన అ ఆ తర్వాత నితిన్‌కి మరో హిట్ రాలేదు. బ్యాడ్ ఛాయిస్ ఆఫ్ స్టోరీస్‌తో కెరియర్‌ని పాడు చేసుకున్నాడు. మళ్లీ హిట్ కోసం ఛలో దర్శకుడితో టీమప్ అయ్యాడు. మరోవైపు, రష్మికకి యూత్‌లో యమా క్రేజ్ పెరుగుతోంది. దేవదాసు సినిమాలో ఆమెకి మంచి పాత్ర దక్కలేదు, సినిమా కూడా ఆడలేదు. ఐనా రష్మికకి యూత్‌లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.
"గీత గోవిందం" సినిమాతో ఆమె స్టార్‌డమ్ పెరిగింది. ఇక విజయ్ దేవరకొండతో ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది రష్మిక. ఇటు డియర్ కామ్రేడ్, అటు నితిన్ సినిమా..రెండింటిని ప్యారలల్‌గా చేస్తుందట.
- Log in to post comments