రష్మిక చిన్నప్పుడే కవర్ గర్ల్!

Rashmika dons cover of Gokulam in 2001
Wednesday, June 3, 2020 - 22:30

రష్మిక మందన్నా ఇప్పుడు అగ్ర హీరోయిన్లలో ఒకరు. సో ఆమె ఫొటోలతో కవర్ పేజీలని అలంకరించుకుంటాయి సినిమా, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్లు. కానీ పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందన్నట్లు ఆమె చిన్నప్పుడే పత్రికలను అట్ట్రాక్ట్ చేసింది. 

అంటే నమ్మగలరా? అది నిజం. 2001లో రష్మిక ఒక పత్రికకి కవర్ గర్ల్ గా పోజ్ ఇచ్చింది. గోకులం అనే చిన్న పిల్లల మేగజైన్ ... 2001లో రష్మిక ఫోటోని కవర్ పేజీగా వేసింది. ఆ నాటి పత్రికని నేడు షేర్ చేసింది రష్మిక. అంతే కాదు...ఇంకా తనకి నిండా పాతికేళ్ళు కూడా నిండలేదు అని హింట్ ఇస్తున్నట్లుగా మీకు అర్థం అవుతోందా?

కన్నడ భామ ....రష్మిక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతోంది. త్వరలోనే అల్లు అర్జున్ సరసన "పుష్ప" సినిమా షూటింగ్లో పాల్గొంటుంది.