రష్మికకి షాకింగ్ సమాధానాలు

Rashmika gets shocking alternatives to her name
Friday, May 22, 2020 - 15:30

సోషల్ మీడియాతో ఎంత ప్రయోజనం ఉంటుందో, అంతే ప్రమాదం కూడా ఉంటుంది. లైకులు కొడుతున్నారు కదా అని ఏది పడితే అది పోస్ట్ చేస్తే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. హీరోయిన్ రష్మిక విషయంలో అదే జరిగింది. తనకు రష్మిక కాకుండా మరో పేరు పెట్టే అవకాశాన్ని నెటిజన్లకు ఇచ్చింది ఈ బ్యూటీ. రష్మిక బదులు మరో పేరు పెట్టాలని సూచించింది.

సరిగ్గా ఇక్కడే రష్మిక బుక్కయిపోయింది. నెటిజన్లు ఆమెతో ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. రకరకాల పిచ్చి పేర్లు పెడుతూ రష్మికను ఏడిపించారు. గతంలో ఓ సందర్భంలో రష్మిక పేరును సరిగ్గా పలకలేక ఇబ్బంది పడ్డారు చిరంజీవి. ఆ పద ప్రయోగాన్ని కూడా కొంతమంది ప్రస్తావించారు. ఇలా రష్మికపై రకరకాల సెటైర్లు పడ్డాయి.

తన కోసం మంచి మంచి పేర్లు పుట్టుకొస్తాయని భావించిన రష్మికకు నెటిజన్లు అలా షాకిచ్చారు. అయితే కొంతమంది మాత్రం సీరియల్ గానే రియాక్ట్ అయ్యారు. డియర్ కామ్రేడ్ లో లిల్లీ పేరు బాగా సూట్ అవుతుందంటూ ఎక్కువమంది రియాక్ట్ అవ్వడం విశేషం.