ర‌ష్మిక‌ని అంద‌రూ అడుగుతున్నారుగా

Rashmika in much demand
Tuesday, April 23, 2019 - 14:45

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో య‌మా బిజీగా ఉన్న హీరోయిన్లు ఇద్ద‌రే. ఒక‌రు పూజా హెగ్డే. మ‌రొక‌రు ర‌ష్మిక‌. "గీత గోవిందం" సినిమాతో కుర్ర‌కారులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ర‌ష్మిక‌కి ఇపుడు పెద్ద హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే ఈ భామ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందే మూవీలో హీరోయిన్‌గా సెల‌క్ట్ అయింది. ఈ సినిమా మొద‌ల‌వుతుందా అన్న విష‌యంలో డౌట్స్ ఉన్న మాట నిజ‌మే కానీ ర‌ష్మిక‌నే తాను ఈ మూవీని సైన్ చేసిన‌ట్లు అఫీషియ‌ల్‌గా ట్వీట్ చేసింది. తాజాగా మ‌హేష్‌బాబు స‌ర‌స‌న కూడా న‌టించ‌నుంద‌ట‌. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప‌లువురు ఇత‌ర హీరోయిన్ల‌ని ప‌రిశీలించిన‌ప్ప‌టికీ ఫైన‌ల్‌గా ర‌ష్మిక వైపు మొగ్గుచూప‌తున్నాడ‌ట‌.

ఇవి కాకుండా నితిన్ స‌ర‌స‌న "భీష్మ‌"లో న‌టించ‌నుంది ర‌ష్మిక‌. అలాగే త‌మిళంలో కార్తీ స‌ర‌స‌న ఒక మూవీ ఒప్పుకొంది. ఇలా ర‌ష్మిక అందరికీ ఫేవ‌రేట్‌గా మారిపోయింది.