ఫోటోల‌తో అద‌ర‌గొడుతున్న ర‌ష్మిక‌

Rashmika shares new pics
Monday, June 17, 2019 - 10:30

మిగ‌తా హీరోయిన్ల‌తో పోల్చితే ర‌ష్మిక హాట్ హాట్ ఫోజులు ఇవ్వ‌దు. సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫోటోల‌ను పెద్ద‌గా షేర్ చేయ‌దు. ఈ అమ్మడు స‌డెన్‌గా కొత్త ఫోటోసూట్ ఫోజుల‌తో ఇపుడు అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తోంది. మ‌హేష్‌బాబు స‌ర‌స‌న చాన్స్ కొట్టేసింది. మ‌హేష్‌కి జోడిగా ర‌ష్మిక ఏంట‌ని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. దాంతో వారికి స‌మాధానం ఇవ్వాల‌నే ఉద్దేశంతో కాబోలు ఈ కొత్త ఫోటోసూట్‌ని అప్‌డేట్ చేసింది.

గీత గోవిందం సినిమాతో స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న ర‌ష్మిక ఇపుడు నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. మ‌హేష్‌బాబు స‌ర‌స‌న మూవీతో పాటు సుకుమార్ డైర‌క్ష‌న్‌లో రూపొందే చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని లాగేసుకొంది. ఇక నితిన్‌తో భీష్మ కూడా ఉంది. అంటే ఈ సుంద‌రి ఫేట్ మామూలుగా లేదు.