చేతిలో చెయ్యేస్తే చిరాకు: రష్మిక

Rashmika talks about love and more
Friday, February 14, 2020 - 17:30

ఈ వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నావు అని ప్రశ్నిస్తే... నాకు అది అంటేనే ఎలర్జీ అంటోంది రష్మిక. అంతే కాదు... ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసి నడిచే ప్రేమ జంటలని చూస్తే చిరాకు అంటూ తన వైల్డ్ సైడ్ ని చూపిస్తోంది రష్మిక. ఆమెకి ఇంతవరకు ఎవరు లవ్ లెట్టర్లు కూడా రాయలేదంట. ఇలాంటి బోలెడన్ని మాటలని కసిగా చెప్పింది రష్మిక. 

భీష్మ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాలని బయట పెట్టింది. అంతే కాదు, మనసు పారేసుకుందామంటే ఇండస్ట్రీలో ఎవరూ ఎలిజిబుల్ బ్యాచిలర్ లేరు అని చెప్తోంది. మరి పెళ్లి కానీ హీరోలు కొందరు ఉన్నారు కదా. బహుశా వారికి ఆల్రెడీ గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని రష్మిక తెలుసు కాబోలు. 

ఈ ఇంటర్వ్యూ చూడండి.