తెగ ఫీలవుతోన్న రష్మిక

Rashmika at Warangal success meet
Friday, January 17, 2020 - 21:45

మహేష్ బాబు వంటి బడా స్టార్ సరసన నటించిన ఆనందాన్ని రష్మిక పూర్తిగా ఎంజాయ్ చేయలేక పోతోంది. ఎందుకంటే... ఆమె ఇంటిపై ఐటీ  దాడులు జరిగాయి. కర్ణాటకలోని కొడగు ఆమె స్వంత ప్రాంతం. అక్కడ ఆమె తల్లితండ్రులు ఉంటారు. ఆ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు జరిపి 25 లక్షల క్యాష్, కొన్ని డాక్యూమెంట్లు తీసుకున్నారు. అయితే, వాటిని మరిచిపోయి... ఆమె శుక్రవారం వరంగల్లో జరిగిన 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ సంబరాల్లో పాల్గొంది. 

ఈ వేడుకలో ఆమె చాలా యాక్టీవ్ గా పాల్గొంది. ఐటీ  దాడులు  జరగకపోయి ఉండుంటే ఇంకా జోష్ గా ఎంజాయ్ చేసి ఉండేది. మహేష్ బాబు తో నటించడం మరిచిపోలేను అని చెప్పింది. 

రష్మీక త్వరలోనే భీష్మ సినిమాతో మన ముందుకు రానుంది. అది వచ్చే నెల రిలీజ్ అవుతోంది. ఇక బన్నీ  సరసన కూడా నటిస్తోంది. సుకుమార్ తీస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్.