రష్మికకి ప్లేస్ లేదన్న రక్షిత్

Rashmika will not be part of my movie: Rakshit Shetty
Tuesday, March 24, 2020 - 16:45

రష్మిక నటించిన ఫస్ట్ మూవీ... "కిరాక్ పార్టీ". రక్షిత్ శెట్టి హీరోగా నటించి తీసిన ఈ మూవీ కన్నడనాట భారీ విజయం సాధించింది. ఆ సినిమా టైంలోనే రక్షిత్, రష్మిక ప్రేమలో పడడం, వెంటనే ఎంగేజ్మెంట్ జరిగిపోవడం అయింది. ఐతే, తెలుగులోకి "చలో" సినిమాతో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆమె మనసు మార్చుకొంది. తర్వాత విడిపోయారు వీళ్లిద్దరూ. 

ఇప్పుడు రష్మిక తెలుగునాట పెద్ద హీరోయిన్. చేతిలో బడా మూవీస్ ఉన్నాయి. ఐతే, తాజాగా రక్షిత్ ... తన కిరాక్ పార్టీ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశాడు. మరి ఈ పార్ట్ 2లో రష్మిక నటిస్తుందా? అదే విషయాన్నీ రక్షిత్ ని అడిగితే... కొత్త కాస్టింగ్ ఉంటుంది అని చెప్పాడు. ఇన్ డైరెక్ట్ గా రష్మికకి ఈ మూవీలో ప్లేస్ మెంట్ లేదని చెప్పాడు. 

రష్మిక ఇప్పుడు బన్నీ సినిమాలో నటిస్తోంది. కానీ ఆ మూవీ రెగ్యులర్ షూట్ ఇంకా షురూ కాలేదు.