ఆవిరికి కలెక్టర్ ఆమ్రపాలి స్ఫూర్తి!

Ravi Babu inspired by Amprapali life
Wednesday, October 30, 2019 - 14:15

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌విబాబు తీసిన కొత్త చిత్రం 'ఆవిరి'. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ నటించిన ఈ చిత్రం న‌వంబర్ 1న విడుద‌ల కానుంది. 

వరంగల్ లో జరిగిన ఒక సంఘటన ఈ సినిమాకి స్ఫూర్తి అని అంటున్నారు రవిబాబు. "వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి ఇంట్లో దెయ్యం ఉంద‌నే క‌థ‌నాన్ని పేప‌ర్‌లో చూశాను. ఆస్టోరీ చ‌దివిన త‌ర్వాత నాకొక ఆలోచన వ‌చ్చింది. ఐతే ఇదొక ఫిక్ష‌న‌ల్ స్టోరీ, ఆమ్రపాలి జీవితానికి దీనికి సంబంధం లేదు," రవిబాబు చెప్పుకొచ్చారు. 

"ఆవిరి` సినిమా హార‌ర్ సినిమా కాదు. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌. నేను ఇంత‌కు ముందు తీసిన సినిమాల‌న్నీ కూడా థ్రిల్ల‌ర్ సినిమాలే. క‌థ‌ను చెప్ప‌డంపైనే నేను ఫోక‌స్ పెడ‌తాను. ప్రేక్ష‌కుల‌ను ఏదో భ‌య‌పెట్టాల‌ని ఆలోచించ‌ను. ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడితేనే ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతార‌ని ఎప్పుడూ అనుకోలేదు," అంటూ ఈ సినిమా గురించి వివరించారు. 

మరి తదుపరి చిత్రం ఏంటి? "ఒక ముస‌లాయ‌న‌కు సంబంధించిన ఓ క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించాల‌నుకుంటున్నాను. ఈ సినిమాను యు.ఎస్‌లో చిత్రీక‌రించాలి. దాదాపు ఆ సినిమానే చేస్తాను. ఒక‌వేళ నాగేశ్వ‌ర‌రావుగారు బ్ర‌తికి ఉండుంటే ఆయ‌న్ని వెళ్లి న‌టించ‌మ‌ని రిక్వెస్ట్ చేసేవాళ్లం. ఇప్పుడు ఆ ముస‌లాయ‌న క్యారెక్ట‌ర్‌ను ఎవ‌రితో చేయించాల‌నే దాన్ని ఆలోచిస్తున్నాను."