టచ్ చేసి చూస్తే కామెడీ

Ravi Teja banks on his comedy only
Wednesday, June 14, 2017 - 15:00

కామెడీ పండించడంలో మన హీరోలు ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. అలానే రవితేజది కూడా డిఫరెంట్ స్టయిల్. ఒకప్పుడు రవితేజ-బ్రహ్మానంద కలిసి హిలేరియస్ కామెడీ పండించారు. కాకపోతే ప్రస్తుతం హాస్యబ్రహ్మతో పాటు మాస్ రాజా కూడా డల్ అయిపోయాడు. ఇద్దరి కెరీర్ రఫ్ పేజ్ లో నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో మరోసారి తన కామెడీ టైమింగ్ కు పదును పెడుతున్నాడు రవితేజ.

ప్రస్తుతం ఈ మాస్ హీరో రెండు సినిమాలు చేస్తున్నాడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమా చేస్తూనే, విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ టచ్ చేసి చూడు మూవీలో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ మంచి కామెడీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాల‌కు అదే మెయిన్ ఎట్రాక్షన్ అని టాక్.

క‌థ‌ సీరియస్ గా ఉన్నప్పటికీ.. అందులో కామెడీ దట్టిస్తే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవడం ఖాయం. ప‌టాస్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి త‌న రెండు సినిమాల‌తో అదే ప్రూవ్ చేశాడు. ఇపుడు ర‌వితేజ‌తో అదే ప్యాట్ర‌న్ ఫాలో అవుతున్నాడ‌ట‌. ఇక కొత్త ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ కూడా ఇప్పుడు టచ్ చేసి చూడు సినిమా కూడా కామెడీనే నమ్ముకున్నట్టుంది.