అహా నిర్మాతగా రవితేజ!

Ravi Teja to produce web content for Aha
Tuesday, July 21, 2020 - 12:15

హీరో రవితేజ ఓటీటీలోకి ఎంటరవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించాడు. అల్లు అరవింద్ కు చెందిన "ఆహా"తో ఆయన చర్చలు జరుపుతున్నాడు. అయితే అవి ఎలాంటి చర్చలనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

బేసిగ్గా నిర్మాణ రంగంలోకి రావాలనేది రవితేజ ఆలోచన. మొన్నటివరకు సినిమాలు నిర్మిద్దామనే ప్లాన్ లో ఉన్నాడు. అయితే అంతకంటే ముందు ఓటీటీలోకి ఎంటరై వెబ్ సిరీస్ లేదా ఎక్స్ క్లూజివ్ మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు ఆహా యూనిట్ తో ఆయన చర్చలు షురూ చేశాడు.

అయితే ఆహాలో ఆయన పెట్టుబడులు పెడతాడని కొందరు అంటున్నారు. అలాంటిదేం లేదు కేవలం నిర్మాణ భాగస్వామ్యం మాత్రం తీసుకుంటారని మరికొందరంటున్నారు. రవితేజ పాత్ర ఏదైనా ఆయన "ఆహా"తో కలిసి ముందుకెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ తన కొత్త వెంచర్ కోసం ఆయన 'ఆహా'ను సంప్రదించడమే ఇక్కడ విచిత్రం. ఎందుకంటే నిజంగా రవితేజ లాంటి హీరో ముందుకొస్తే ఆయనకు రెడ్ కార్పెట్ పరవడానికి అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5 లాంటి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని కాదని ఆయన ఆహాకు వెళ్లడం విడ్డూరంగా ఉంది.