అంత్యక్రియలపై క్లారిటీ ఇచ్చిన రవితేజ

Ravi Teja speaks to media about Bharath
Wednesday, July 5, 2017 - 15:45

భరత్ అంత్యక్రియల వ్యవహారంతో ఒక్కసారిగా రవితేజ పేరు వార్తల్లోకెక్కింది. అంత్యక్రియలకు రవితేజ హాజరు కాకపోవడంపై రకరకాల కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు వీటిపై రవితేజ స్పందించాడు. భరత్ మరణం తర్వాత తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన  రవితేజ.. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదంటున్నాడు.

"ఇలాంటి వార్తలు రాసేటప్పుడు దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి. నా సోదరుడు, నాకు మధ్య ఉన్న అన్యోన్యత గురించి మీకెవరికీ తెలీదు. మేం ఎలా ఉంటామో గతంలో మీడియాకు 2-3సార్లు నేను చెప్పాను. ఇవన్నీ తెలిసి కూడా ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్లు రాసేశారు. అది పద్ధతి కాదు. దయచేసి ఇకమీదట అలాంటివి చేయకండి. మా చిన్నాన్నను జూనియర్ ఆర్టిస్ట్ ను చేసేశారు. మా తండ్రి న్యూస్ తెలుసుకొని ఎలా అయిపోయారో నాకు తెలుసు. కేవలం భరత్ ను అలాంటి కండిషన్ లో చూడలేక మృతదేహాన్ని ఇంటికి తీసుకురాలేదు. భరత్ ముఖం మా మనసుల్లో అలా ఉండిపోవాలి. అందుకే డెడ్ బాడీ చూడలేదు.  ఇలాంటి విషయాల్లో ఒక్కసారి చెక్ చేసుకొని రాయండి. " భరత్ మృతిపై రవితేజ వెర్షన్ ఇది.

ఓ జూనియర్ ఆర్టిస్ట్ కు డబ్బులిచ్చి అంత్యక్రియలు చేశారనే వార్తను కూడా రవితేజ ఖండించాడు. అంత ఖర్మ తనకు పట్టలేదన్నాడు. ఇక అంత్యక్రియల రోజు షూటింగ్ లో పాల్గొన్న విషయం కూడా నిజం కాదన్నాడు. అంత్యక్రియల రోజంతా తను తల్లిదండ్రులతోనే ఉన్నానని, నెక్ట్స్ డే మాత్రం షూటింగ్ లో పాల్గొన్నానని అంటున్నాడు రవితేజ.