ఇక్కడే కానిచ్చేస్తోన్న రవితేజ

రవితేజ హీరోగా "అమర్ అక్బర్ ఆంటోని" అనే మూవీ రూపొందిస్తున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. సినిమా కథ ప్రకారం చాలా వరకు అమెరికాలోనే తీయాలి. అందుకే తొలి షెడ్యూల్‌ని అమెరికాలో తీశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అమెరికాలోని వివిధ ప్రదేశాల్లో తీసే విధంగా ప్లాన్ చేశారు. కానీ ఇపుడు ప్లాన్ మారిందట.
అమెరికాకి సంబంధించిన చాలా సన్నివేశాలు ఇపుడు హైదరాబాద్‌లోనే తీస్తున్నారట. అంటే అమెరికాలో ఇంటిరియర్‌కి (ఇళ్లు, ఆఫీస్ లోపలి దృశ్యాలు, ఇతర సీన్లు) సంబంధించిన సీన్లన్నీ ఇపుడు భాగ్యనగరంలోనే కానిచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కాస్ట్ కటింగ్‌లో భాగమే.
"అమర్ అక్బర్ ఆంటోనీ "మొదలుపెట్టినపుడు రవితేజకి కేవలం "టచ్ చేసి చూడు" అనే ఫ్లాప్ మాత్రమే ఉంది. కానీ మొదటి షెడ్యూల్ పూర్తయ్యేసరికి ఇంకో ఫ్లాప్ వచ్చి చేరింది. "నేలటికెట్"తో రవితేజ మార్కెట్ నేలకరిచింది. దాంతో శ్రీనువైట్ల జాగ్రత్త పడడం మొదలుపెట్టాడు. ఇప్పటికే వైట్ల ఫ్లాప్‌ల్లో ఉన్నాడు. దానికితోడు రవితేజ ఫ్లాఫులు తోడు అయ్యాయి. సో..ఎక్కువ ఖర్చు పెడితే ఒప్పుకోమని నిర్మాతలు తేల్చి చెప్పారట. దాంతో అమెరికా షెడ్యూల్‌ని కుదించేశారు. మ్యాగ్జిమమ్ హైదరాబాద్‌లోనే తీసి.. చివర్లో కొంత భాగాన్ని అమెరికాలో తీస్తారట.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ వైట్ల దర్శకత్వంలో ఒక మూవీ, రభస దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో మరో సినిమాని రవితేజతో ప్రారంభించింది. ఇపుడు సంతోష్ శ్రీనివాస్ మూవీని తాత్కలికంగా ఆపేసింది. ఇక వైట్ల మూవీకి కాస్ట్ కటింగ్ చెప్పింది.
- Log in to post comments