అయినను పోయి రావాలె రవితేజ వద్దకు!

Ravi Teja's market has not died yet?
Thursday, February 27, 2020 - 10:30

"అయినాను పోయి రావాలె" రవితేజ వద్దకు అని అంటున్నారు నిర్మాతలు. నిజానికి ...రవితేజ ప్రస్తుత ఫామ్ చూస్తే... ఒక్క నిర్మాత కూడా అతనితో కొత్త సినిమా ప్రకటించొద్దు. రవితేజ రీసెంట్ సినిమా 'డిస్కో రాజా' థియేటర్లో 7 కోట్ల షేర్ మాత్రమే తీసుకొచ్చింది. అంత దయనీయంగా ఉంది రవితేజ మార్కెట్. ఇంత బాడ్ పొజిషన్లోనూ రవితేజ వరుసగా సినిమాలు సైన్ చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. 

రవితేజ ప్రస్తుతం 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది మే 8న విడుదల కానుంది. ఇక ఇప్పటికే రమేష్ వర్మ డైరెక్షన్లో ఒక మూవీ అనౌన్స్ అయింది. ఆ తర్వాత కూడా రవితేజ హీరోగా నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తోందట. అంటే ఆల్రెడీ రెండు సినిమాలను రవితేజ లైన్లో పెట్టాడు. ఈ లెక్కన చూస్తే రవితేజ కెరీర్ కి పెద్దగా ఢోకా లేదు.

హిందీ డబ్బింగ్ మార్కెట్, శాటిలైట్ మార్కెట్ ద్వారా వచ్చే మొత్తం రవితేజని కాపాడుతోంది.