క్షణం దర్శకుడి రెండో సినిమాకి మోక్షం

Ravikanth Perepu's second film is seeing the light of the day
Monday, December 9, 2019 - 22:00

"క్షణం" సినిమాకి ఎంత పేరు వచ్చిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ సినిమా సక్సెస్ తో అడివి శేష్ కెరీర్ స్థిర పడిపోయింది.  కానీ దర్శకుడు రవికాంత్ పేరు మాత్రం కష్టాల్లో పడ్డాడు. సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా తీసి... అడ్డంగా బుక్ అయ్యాడు. సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోరు. కరెక్షన్స్ పేరుతో డైరెక్టర్లని విసిగిస్తారని ఒక అపవాదు. 

రవికాంతు "Krishna & His లీల" సినిమాకి అదే సమస్య ఎదురుకున్నాడు. ఒక దశలో విసుగెత్తి సినిమాని వదిలేసి వెళ్ళిపోయాడు డైరెక్టర్. దాంతో రానా కలగచేసుకొని ...ఆ మూవీని ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. ప్రెసెంటరుగా తన పేరు కూడా వేసుకొని సినిమాని రిలీజ్ చేస్తున్నాడు రానా. ఆలా క్షణం దర్శకుడి రెండో సినిమాకి మోక్షం కలుగుతోంది.