నాకు కరోనా అలా వచ్చింది

Ravikrishna reveals how he has tested coronapositive
Wednesday, July 8, 2020 - 18:00

సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవికృష్ణ.. తనకు కరోనా ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు. షూటింగ్స్ లో ఆర్టిస్టులకే ఎక్కువగా కరోనా సోకే ప్రమాదముందంటున్న రవికృష్ణ.. దురదృష్టవశాత్తూ తనకు సోకిందంటున్నాడు.

"మాకు మాస్క్ పెట్టుకునే అవకాశం ఉండదు. టెక్నీషియన్స్ తో పాటు మిగతా డిపార్ట్ మెంట్ వాళ్లు పెట్టుకుంటారు. మాకు ఆ ఛాన్స్ లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఆర్టిస్టుకే రిస్క్ ఎక్కువ. ఎందుకంటే రిహార్సల్స్, టేక్స్ అప్పుడు మాస్క్ పెట్టుకోం. సో.. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో నాకు వైరస్ ఎటాక్ అయింది."

నవ్య, తను ఒకే సీరియల్ (ఆమె కథ)లో లీడ్స్ గా చేస్తున్నామని.. ఒకే సీరియల్ కు చెందిన హీరోహీరోయిన్లు ఇలా కరోనా బారిన పడడం ఏ సీరియల్ కు జరగలేదంటున్నాడు. అయినప్పటికీ తను సేఫ్ గానే ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని చెబుతున్నాడు.

"నవ్యకు ఎప్పుడైతే కరోనా పాజిటివ్ అని తెలిసిందో అప్పట్నుంచి నేను కూడా జాగ్రత్తపడ్డాను. ప్రస్తుతం ఇద్దరం తొందరగా కోలుకుంటున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఓ సీరియల్ లో మేమిద్దరమే లీడ్. ఇద్దరం వైరస్ బారిన పడ్డాం. దీంతో ఆ సీరియల్ ఎఫెక్ట్ అయింది. కానీ ఆల్రెడీ చేసిన ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేలోపు మేమిద్దరం కోలుకొని వచ్చేస్తాం."

తన కంటే ఫాస్ట్ గా నవ్య కోలుకుంటోందని, తను కూడా 2-3 రోజులు అటుఇటుగా రికవరీ అయి సెట్స్ పైకి వచ్చేస్తానంటున్నాడు రవికృష్ణ