స్పైడర్ కు ఆ పేరు అందుకే పెట్టారా?

Reason behind the title of Spyder
Thursday, June 1, 2017 - 19:00

మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ గ్లింప్స్ రిలీజ్ అయింది. దీన్నే మనం ఫస్ట్ లుక్ టీజర్ అని కూడా అనుకోవచ్చు. ఎవరూ ఊహించని విధంగా బయటకొచ్చింది స్పైడర్ టీజర్. ఓ డబ్బాను క్లోజ్ లో చూపించి, అది స్పైడర్ గా మారడం చూపించారు. అది కూడా మామూలు స్పైడర్ కాదు. రోబో స్పైడర్ అన్నమాట. ఆ స్పైడర్ మెల్లగా పాక్కుంటూ వచ్చి మహేష్ భుజంపైకి చేరడం. ఇదీ స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ కథ. స్పై అంటే గూఢచారి అని అర్థం. ఈ సినిమాలో మహేష్, గుఢచారిగా నటిస్తున్నాడు కాబట్టి.. రిథమ్ కోసం స్పైడర్ అని పేరుపెట్టి ఉంటారని అంతా భావించారు. కానీ సినిమాలో అంతకుమించి ఉందనే విషయం ఈ “గ్లింప్స్” చూస్తే అర్థమౌతోంది. కచ్చితంగా సినిమాలో ఈ రోబో స్పైడర్ కు చాలా పెద్ద స్టోరీనే ఉన్నట్టు కనిపిస్తోంది.

కౌంటర్ టెర్రరిజం కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోందట. టీజర్ లో మనం చూస్తున్న స్పైడర్ ను మహేష్ బాబే తయారుచేస్తాడట. సినిమా కథకు, ఈ స్పైడర్ కు ఏంటి సంబంధం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.