స్టార్ట్ అయింది రెడ్

Red begins regular shoot
Friday, November 15, 2019 - 16:45

రామ్ హీరోగా "రెడ్" అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అవును.. రెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో మొదలైంది. పూజా కార్యక్రమాలు నిర్వహించి, చడీచప్పుడు కాకుండా ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. 

కేవలం ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే కాదు, ఇకపై ప్రతి షెడ్యూల్ ను ఇలానే సైలెంట్ గా, వీలైతే సీక్రెట్ గా జరపాలని యూనిట్ భావిస్తోంది. రామ్ కు సంబంధించి ఇప్పటికే ఓ లుక్ రిలీజైంది. ప్రారంభోత్సవం రోజునే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్న రామ్, మరో లుక్ లో కూడా కనిపించబోతున్నాడు. ఆ లుక్ బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఇలా సైలెంట్ గా షూట్ చేస్తున్నారు. పైగా ఇది రీమేక్ కావడంతో, ఎక్కువ హడావుడి చేయకుండా పనికానిచ్చేసి, ఒకేసారి ప్రమోషన్ స్టార్ట్ చేయాలనేది ప్లాన్.

తమిళ్ లో హిట్ అయిన "తడమ్" సినిమాకు రీమేక్ గా వస్తోంది "రెడ్". కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో "నేలటిక్కెట్" ఫేం మాళవిక శర్మ, నివేథా పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.