రెజీనాకు లైంగిక వేధింపులు

Regina makes startling comments about sexual harassment
Thursday, June 25, 2020 - 18:30

తను కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపింది అందాల తార రెజీనా. కాకపోతే ఇండస్ట్రీలో తనను ఎవ్వరూ లైంగికంగా వేధించలేదని, కాలేజీ రోజుల్లో తను వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చింది. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన రెజీనా.. చెన్నైలో చదువుకునే రోజుల్లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది.

చెన్నైలోని ఇగా థియేటర్ బ్రిడ్జి వద్ద కొంతమంది అబ్బాయిలు రెజీనాను అడ్డుకున్నారట. రెజీనాతో పాటు ఉన్న మరో నలుగురు అమ్మాయిల్ని కూడా వేధించారట. వాళ్లలో ఒకబ్బాయి అయితే రెజీనా పెదవులు తాకడానికి కూడా ప్రయత్నించాడట.

తనను వేధించిన ఆ యువకుడ్ని పబ్లిక్ గానే పట్టుకొని కొట్టానని చెప్పుకొచ్చింది రెజీనా. సున్నితంగా ఉంటే ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయని, అమ్మాయిలు కాస్త గట్టిగా వ్యవహరించాలని అంటోంది.

తెలుగులో SMS సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఆ తర్వాత "రొటీన్ లవ్ స్టోరీ", "పిల్ల నువ్వు లేని జీవితం", "సుబ్రమణ్యం ఫర్ సేల్" సినిమాలతో హీరోయిన్ గా నిలదొక్కుతుంది. "ఎవరు" సినిమాలో విలన్ గా కూడా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

|

Error

The website encountered an unexpected error. Please try again later.