రెజీనా కికి ఛాలెంజ్ డ్యాన్స్‌

Regina posts dancing to Kiki challenge
Tuesday, July 31, 2018 - 14:15

"ఇన్ మై ఫీలింగ్స్" సాంగ్ నెలరోజులుగా వైరల్ అవుతోంది. కికి ఛాలెంజ్, ఇన్ మై ఫీలింగ్స్ ఛాలెంజ్ అనే పేరుతో అంద‌రూ వీడియోలు పెడుతున్నారు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన రెజీనా.. త‌న డాన్స్‌తో అదరగొట్టేసింది. నెమ్మదిగా కదులుతున్న వాహనం పక్కనే డాన్స్ చేయడమే ఈ ఛాలెంజ్. దక్షిణ భార‌తీయ అమ్మాయిలను కూడా నీ పాట‌తో ఫిదా చేశావు అంటూ ఆ పాప్ సింగ‌ర్‌కి కాంప్లిమెంట్ ఇచ్చి.. రెజీనా ఇలా రోడ్డుపై డ్యాన్స్ చేసింది.

ఒక సినిమా షూటింగ్‌కి వెళ్తూ..ఇలా మ‌ధ్య‌లో ఈ వీడియో తీసి పోస్ట్ చేసింది. హాఫ్ శారీలో ప‌క్కా సౌత్ ఇండియ‌న్ అమ్మాయిలా అద‌రగొట్టింది.. ఆ వీడియోకి సోషల్ మీడియాలో మాంచి రెస్పాన్స్ వస్తోంది.