రెజీనాని ప్రేమించిన హీరో ఎవ‌రు?

Regina says her mistake was falling in love!
Thursday, January 18, 2018 - 14:30

"ప్రేమ‌లో ప‌డి పొర‌పాటు చేశా" అని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చింది రెజీన. ఎంతో సాధించాల‌ని సినిమాకి ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను కానీ ల‌వ్ కార‌ణంగా ల‌క్ష్యం నుంచి చూపు త‌ప్పుకొంద‌ని వివ‌రించింది ఈ చెన్నై సుంద‌రి. ప్రేమ‌లో పడ‌డం వ‌ల్ల కెరియ‌ర్‌లో త‌ప్పులు, సినిమాల సెల‌క్ష‌న్ ప‌రంగా రాంగ్ చాయిస్‌లు జ‌రిగాయ‌ని వివ‌రించింది.

అంతా బానే ఉంది కానీ ఇంత‌కీ ఆమె ప్రేమ‌లో ప‌డింది ఎవ‌రితో? ఆ విష‌యాన్ని మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. ప‌ర్స‌న్ ముఖ్యం కాదిపుడు అంటోంది. అంతేకాదు ఇపుడు త‌ప్పుని దిద్దుకుంద‌ట‌. ఆమెకి సినిమాల్లో చాలా అవ‌కాశాలే వ‌చ్చాయి.  ఆఫ‌ర్లు ఎక్కువ వ‌చ్చినా... భారీ హిట్‌లు రాలేద‌న్న అసంతృప్తి మాత్రం ఉంది. అందుకే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

రోటీన్ ల‌వ్‌స్టోరీ, కొత్త జంట‌, ప‌వ‌ర్‌, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సౌఖ్యం, శౌర్య‌, శంక‌ర‌, జ్యో అచ్యుతానంద‌, మ‌హా న‌గ‌రం, న‌క్ష‌త్రం, బాల‌కృష్ణుడు... ఇలా తెలుగులో ఆమె చాలా సినిమాల్లో న‌టించింది. త్వ‌ర‌లో నాని నిర్మిస్తున్న అ! అనే సినిమాలోనూ క‌నిపించ‌నుంది.

తెలుగులో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఒక యువ హీరోతో కొంత‌కాలం ఆమె స‌న్నిహితంగా మెలిగింది. ఆ హీరోతోనే ఆమె ప్రేమ‌లో ప‌డిందా అన్న డౌట్స్ మాత్రం అంద‌రిలోనూ ఉన్నాయి.