రెజీన హీరోయిన్ గా మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

Regina's new thriller
Tuesday, January 7, 2020 - 17:00

తొలి చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమాతో  న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌గా  మంచి పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు. అయన ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా తెర‌కెక్క‌నుంది. యాపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రెజీన హీరోయిన్ గా ఈ సినిమా రూపొంద‌నుంది. యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, కామెడీ అంశాల‌తో ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌నుంది. 

"కార్తీక్ రాజు రాసిన క‌థ‌ను విన్న త‌ర్వాత నిర్మాత‌గా కంటే ప్రేక్ష‌కుడిగా చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కిన ఔట్ స్టాండింగ్, స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్న‌ స్టోరీతో  తెర‌కెక్క‌బోతున్న చిత్ర‌మిది రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఎవ‌రు` చిత్రంలో రెజీనా క‌సండ్ర న‌ట‌న అందరినీ ఆక‌ట్టుకుంది. వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ,  రెజీనా న‌టిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నారు. ఈ సినిమా కోసం ఆమె గొప్ప ఎఫ‌ర్ట్ పెట్టి వ‌ర్క్ చేస్తున్నారు. ఆమె ఎఫ‌ర్ట్‌ను రేపు వెండితెర‌పై ప్రేక్ష‌కులు చూసి ఎంజాయ్ చేస్తారు, "అన్నారు నిర్మాత రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ 

"కొర్టాల‌మ్‌లో జ‌న‌వ‌రి 13 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ల‌వ్ లొకేష‌న్స్‌లోనే సినిమాను ఎక్కువ భాగం చిత్రీక‌రించ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అని తెలిపారు నిర్మాత.