ఆ హీరోయిన్ కు నాగార్జున హ్యాండ్

Rekha narrates an incident about Nagarjuna
Friday, February 21, 2020 - 14:45

హీరోయిన్ల విషయంలో నాగ్ చాలా లిబరల్ గా ఉంటాడని టాక్. వాళ్లకు ఫుల్ స్పేస్ ఇస్తాడని, ఏ హీరో ఉండనంత క్లోజ్ గా కూడా ఉంటాడని అంటుంటారు చాలామంది సినీజనాలు. అందుకే నాగ్ పై హీరోయిన్లు ఎవ్వరూ ఫిర్యాదు చేయరు. అతడ్నుంచి తమకు ఏం కావాలంటే అది నిరభ్యంతరంగా తీసుకుంటారు. కానీ ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం నాగార్జునపై కంప్లయింట్ ఇచ్చింది. మన్మథుడు తనకు హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది.

నాగార్జున తనకు హ్యాండ్ ఇచ్చాడని చెప్పిన ఆ హీరోయిన్ పేరు రేఖ. ఆనందం సినిమాతో ఫుల్లుగా పాపులర్ అయిన ఈ బ్యూటీ... ఈమధ్య అలీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది. అందులో నాగార్జున గురించి మాట్లాడింది. మన్మథుడు అనే సినిమాలో నాగార్జునతో కలిసి నటించానని, ఆ టైమ్ లోనే తనకు మరో ఛాన్స్ ఇస్తానని నాగ్ మాటిచ్చాడని చెప్పుకొచ్చింది రేఖ.

ఆ తర్వాత నాగ్ నుంచి పిలుపు వస్తుందని చాన్నాళ్లు వెయిట్ చేశానని, కానీ నాగ్ తనను మరిచిపోయాడని కాస్త బాధగా చెప్పుకొచ్చింది. అలా నాగార్జున సరసన ఛాన్స్ కోసం చాన్నాళ్లు ఎదురుచూశానని, ఆ తర్వాత ఇక ఛాన్స్ రాదని తెలుసుకొని ముంబయికి షిఫ్ట్ అయిపోయినట్టు చెప్పుకొచ్చింది.

అయితే ఈ వ్యవహారం మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. నాగార్జునపై ఆమె ఎలాంటి కోపం వ్యక్తంచేయలేదు. నాగ్ లాంటి స్వీట్ పర్సన్ ను తను చూడలేదన్న రేఖ, కేవలం తను బిజీలో పడిపోయి తనను మరిచిపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చింది. నిజంగా ఈమె మాటలు నాగార్జున వరకు చేరితే, ఆయన రేఖకు ఛాన్స్ ఇవ్వడం ఖాయం. ఎందుకంటే.. ఒకప్పుడు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నాడు ఈ హీరో. ఈ క్రమంలో రేఖకు ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు