నెపొటిజంపై రేణు రియాక్షన్

Renu Desai reacts on nepotism
Monday, June 22, 2020 - 16:15

బాలీవుడ్ లో నెపొటిజం ఉందంటున్నారు నటి రేణుదేశాయ్. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై రేణు స్పందించారు. బహుశా సుశాంత్ చాలా సెన్సిటివ్ అయి ఉంటాడని, అలాంటి వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు.

"సుశాంత్ సింగ్ చాలా సెన్సిటివ్ అనుకుంటాను. ఇలాంటి వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. సుశాంత్ సక్సెస్ లోనే ఉన్నాడు. స్టార్ అయ్యాడు కూడా. కానీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అందరూ అంటున్నారు నెపొటిజం వల్లనే సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని. నిజమే నెపొటిజం ఉంది."

బాలీవుడ్ లోనే కాదు, ప్రతి రంగంలో నెపొటిజం ఉందంటున్నారు రేణు. అయితే టాలెంట్ ఉండి, ధైర్యంగా నిలబడగలిగితే నెపొటిజంను దాటుకొని సక్సెస్ అందుకోవచ్చంటున్నారు.

"నెపొటిజం ఉంది. ఇందులో దాచడానికేం లేదు. అయితే నేను చెప్పేదేంటంటే.. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి కాకుండా.. కేవలం టాలెంట్ నే నమ్ముకొని వస్తే కుదరదు. టాలెంట్ తో పాటు మనోధైర్యం ఉండాలి. బయట నుంచి ఇండస్ట్రీలోకొచ్చి నిరూపించుకోవాలంటే ఎంతో మానసిక స్థైర్యం అవసరం."

అకీరా కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడంటున్న రేణుదేశాయ్.. ఎవ్వరి సపోర్ట్ లేకుండా అకిరా తనను తాను నిరూపించుకోవాలని, అప్పుడే హీరోగా నిలదొక్కుకోగలడని అంటున్నారు. అకిరా వరుసగా 5-6 హిట్స్ కొట్టినప్పుడు మాత్రమే తనకు స్టార్ మదర్ హోదా వస్తుందని, అప్పటివరకు తను సింపుల్ మదర్ నే అంటోంది.

ఆమె మాజీ భర్త పవన్ కళ్యాణ్, త్వరలో ఆమె కుమారుడు కూడా 'నేపో కిడ్స్' కిందకే వస్తారు. అయినా ఆమె నెపోటిజమ్ గురించి మాట్లాడడం విడ్డూరమే.

|

Error

The website encountered an unexpected error. Please try again later.