'అప్పుడు నా వయసు 18'

Renu Desai talks about her first movie experiences
Tuesday, July 14, 2020 - 13:45

"బద్రి", "జానీ" సినిమాల నాటి సంగతుల్ని మరోసారి గుర్తుచేసుకున్నారు రేణుదేశాయ్. 18 ఏళ్ల చిన్న వయసులో "బద్రి"లో నటించానని, ఆ అనుభూతుల్ని జీవితాంతం మరిచిపోనని చెబుతున్నారు. ఇక "జానీ" టైమ్ లో చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్పుకొచ్చారు.

"బద్రి టైమ్ కు నాకు జస్ట్ 18 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో బాంబే నుంచి వచ్చాను. బద్రి యూనిట్ లో అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఆ తర్వాత జానీ సినిమా చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. చిన్న వయసులోనే కేవలం నటిగా కాకుండా చాలా విభాగాలు చూసుకున్నాను. రోజుకు 16-17 గంటలు పనిచేయగలనని అప్పుడే తెలుసుకున్నాను. మూవీ మేకింగ్ కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నది జానీ టైమ్ లోనే."

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో రష్మిక అంటే తనకు చాలా ఇష్టం అంటున్నారు రేణుదేశాయ్. రష్మిక లుక్స్, యాక్టింగ్ బాగుంటాయని చెబుతున్నారు. దర్శకుల్లో మాత్రం ఫేవరెట్ అంటూ ఎవ్వరూ లేరని.. రాజమౌళి, అనీల్ రావిపూడి, త్రివిక్రమ్ టేకింగ్స్ నచ్చుతాయని చెబుతున్నారు.